Cyclone Michaung: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయిన తిరుపతిలోని ఐదు ప్రధాన డ్యామ్‌లు, ప్రస్తుతం బాపట్లలో తీరం దాటుతున్న తుఫాన్

మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది.

Five Major Dams in Tirupati Reach Full Storage Capacity As Rainfall Caused by Cyclonic Storm Lashes Andhra Pradesh

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది. మరో గంటలో ఇది పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో బాపట్ల వద్ద అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం బాపట్లలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులతో భారీ వర్షం కురుస్తోంది. మిచాంగ్ తుపాను పూర్తిగా తీరం దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. బాపట్ల వద్ద కేవలం 4 గంటల వ్యవధిలోనే 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి తుపాను ముందు భాగం పూర్తిగా భూభాగంపైకి ప్రవేశించిందని ఐఎండీ తన తాజా బులెటిన్ లో వెల్లడించింది.

తుఫాను తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా తిరుపతిలోని ఐదు ప్రధాన డ్యామ్‌లు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో వర్షపాతం కొనసాగుతున్నందున రిజర్వాయర్లలో నీరు అంచుకు చేరుకుందని తెలిపింది.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)