Cyclone Michaung: వీడియో ఇదిగో, వరద నీటితో పరవళ్లు తొక్కుతున్న తిరుమల కపిలతీర్థం జలపాతం, చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు

మిచాంగ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతోంది

kapila-theertham (Photo-Video Grab)

తిరుమల కొండల మధ్య ఉన్న కపిలతీర్థం జలపాతం వరద నీటితో ఉప్పొంగుతోంది. మిచాంగ్ తుపాను కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో శేషాచల అటవీప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో కపిలతీర్థం జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందికి దూకుతోంది. ఇక్కడి మాల్వాడి గుండం జలకళ సంతరించుకుంది. కపిలతీర్థం జలపాతం పోటెత్తుతుండడంతో చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలిస్తున్నారు. జలపాతానికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారీ వర్షాలకు పూర్తిగా నిండిపోయిన తిరుపతిలోని ఐదు ప్రధాన డ్యామ్‌లు, ప్రస్తుతం బాపట్లలో తీరం దాటుతున్న తుఫాన్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)