Kodali Nani on Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే, చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని

చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకడంతో నేతలు ఎదురుదాడికి దిగారు

Gudivada MLA Kodali Nani Sensational Comments On Megastar Chiranjeevi AP Politics Remarks

ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకడంతో నేతలు ఎదురుదాడికి దిగారు. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లున్నారని, ప్రభుత్వం ఎలా ఉండాలో వారు సలహా ఇస్తున్నారంటూ కొడాలి ఫైర్ అయ్యారు.

అలాగే పకోడీ గాళ్లు సలహాలు తనవాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీళ్లు తమ వారికి రాజకీయాలు ఎందుకు, డాన్స్, ఫైట్స్ యాక్షన్ మనం చూసుకుందాం అని చెప్పొచ్చు కదా అంటూ చిరంజీవిని, సోదరుడు పవన్ ను ఉద్దేశించి కొడాలి వ్యాఖ్యానించారు.వీడియో ఇదిగో..

Gudivada MLA Kodali Nani Sensational Comments On Megastar Chiranjeevi AP Politics Remarks

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)