Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్, ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని పిలుపు

చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందిస్తూ..ఈ దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు.

Pawan Kalyan condemns attack on Chilkur Balaji temple priest (Photo/X)

చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందిస్తూ..ఈ దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దురదృష్టకరమైన ఘటన ఇదని... ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా- ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు, పోరాటం చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. రంగరాజన్‌పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని చెప్పారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు.

Pawan Kalyan condemns attack on Chilkur Balaji temple priest

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement