![](https://test1.latestly.com/uploads/images/2024/09/5-232.jpg?width=380&height=214)
చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు.ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలని తెలిపారు.
దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ శ్రీ రంగరాజన్ గారికి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది మనవిచేస్తున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి.. రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో
రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కొందరు అడగగా రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారు నిందితులు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ పవన్‌కుమార్ వెల్లడించారు.