Sharmila Slams CM Jagan Ruling: వీడియో ఇదిగో, బీజేపీ చేతిలో చేతిలో కీలుబొమ్మలా జగన్ ప్రభుత్వం, రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని తెలిపిన షర్మిల
బీజేపీకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయి. మోదీ సర్కారుకు కీలుబొమ్మలా జగన్ ప్రభుత్వం మారింది. రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసింది. ఒక్క రోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి?
ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర నుంచి పుట్టినవేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. వైఎస్‌ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే తాను వచ్చానన్నారు.శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్ఛాపురంలో ‘ప్రజా ప్రస్థానం’ విజయస్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
బీజేపీకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయి. మోదీ సర్కారుకు కీలుబొమ్మలా జగన్ ప్రభుత్వం మారింది. రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసింది. ఒక్క రోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి? రాహుల్‌గాంధీ మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతానని చెప్పారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్. వైఎస్‌ఆర్ ఆశయాలను అందరం బతికిద్దాం’’ అని షర్మిల అన్నారు.
Here's Video