Vizag Steel Plant Privatisation Row: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కుమారస్వామి సంచలన ప్రకటన, ప్రధాని మోదీ అనుమతి తర్వాత అధికారిక నిర్ణయం వెలువరిస్తామని వెల్లడి

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు.

Union Steel Minister HD Kumaraswamy

విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కాసేపటి క్రితం స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు.  ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు ? డీసీ కార్యాయలయం దాడిపై స్పందించిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్

స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉండదని స్పష్టంగా చెబుతున్నామన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయం ఉంటుందని తెలిపారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తనకు 2 నెలలు సమయమివ్వాలని కోరారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement