Andhra Pradesh: వీడియో ఇదిగో, మేం కాపులం, ఎవడ్రా నువ్వు అంటూ మంత్రి కారుముందు రెచ్చిపోయిన యువకులు, కడ్ డ్రాయర్లపై పోలీస్ స్టోషన్లో నిలబెట్టిన పోలీసులు

పోలీసులను సైతం పరుష పదజాలంతో దూషిస్తూ వారిపైకి వెళ్లారు. దీనికి కారణం గంజాయి మత్తు. ఆ మత్తు దిగేంత వరకు ఎంతో సహనంతో వ్యవహరించిన పోలీసులు... ఆ తర్వాత ఆ యువకులను పోలీస్ స్టేషన్‍‌కు తీసుకెళ్లి కడ్ డ్రాయర్లపై (లోదుస్తు) నిలబెట్టారు

youths Obstructed Minister Subhas vehicle under the influence of ganja and created a ruckus saying that we are Kapus

ఏపీలో మందుబాబులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. దివంగత ఎన్జీ రంగా వారసులం, నిజమైన కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధితులను పరామర్శించడానికి మంత్రి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ, పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఏం మాట్లాడారనే చర్చ

మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కాన్వాయ్‌ను ఆపి.. హంగామా చేసిన ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. మట్లపాలెం వెళ్లి మందు తాగకుండా వేసుకున్న కడియాలు తీసేసిన యువకులు.. యానాంలో మందు తాగి రాజమండ్రికి వెళ్తున్న సమయంలో ఇలా రెచ్చిపోయారని పోలీసులు వెల్లడించారు. మత్తు దిగేంత వరకు ఎంతో సహనంతో వ్యవహరించిన పోలీసులు... ఆ తర్వాత ఆ యువకులను పోలీస్ స్టేషన్‍‌కు తీసుకెళ్లి కడ్ డ్రాయర్లపై (లోదుస్తు) నిలబెట్టారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)