TDP Leader JC Prabhakar Reddy Meets YS Vijayamma See Pic

Hyd, July 29: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మను కలిశారు.హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, వైఎస్‌ రెడ్డి రెండో కేబినెట్‌లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన రాజకీయ జీవితం టీడీపీకి మళ్లింది. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఫ్యామిలీలు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.  ఏపీలో వైసీపీ - టీడీపీలకు జనసేన పవన్ కళ్యాణే ప్రత్యామ్నాయమా?, వైసీపీని వీడుతున్న నేతలకు ఫస్ట్ ఛాయిస్ పవనేనా?, పెరుగుతున్న పవన్ గ్రాఫ్ ఏం చెబుతోంది!

2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు.. అనంతరం ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దింపారు. అయితే వారు విజయం సాధించలేవు. ఇక వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్‌పై, తమపై కేసులు పెట్టి.. తీవ్రంగా వేధించారని జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి జైలు జీవితాన్ని కూడా గడిపారు.  ఏపీ సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్, త్వరలో వాలంటీర్లకు శుభవార్త చెప్పనున్న టీడీపీ సర్కార్?

తాజాగా ఏపీకి జరిగిన 2024 ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు వైఎస్‌ విజయమ్మను కలవడం ఆసక్తికరంగా మారింది. తమ బద్ధ శత్రువు అయిన వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు అనే చర్చ ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.