JP Nadda on Dharani Portal: వీడియో ఇదిగో, బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ రద్దు, నడ్డా సంచలన వ్యాఖ్యలు, కొనసాగిస్తామని గతంలో ప్రకటించిన బండి సంజయ్

బీఆర్ఎస్ అంటే అవినీతి(భ్రష్టాచార్‌) రాక్షసుల సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భాజపా నవ సంకల్ప సభ నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా తన ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Bjp national president jp nadda (Photo-Video Grab)

బీఆర్ఎస్ అంటే అవినీతి(భ్రష్టాచార్‌) రాక్షసుల సమితి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా జన్‌సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం భాజపా నవ సంకల్ప సభ నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన నడ్డా తన ప్రసంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్‌ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే TRSను BRSగా మార్చారు. రైతుల భూములను లాక్కునేందుకు, కార్యకర్తల జేబులు నింపేందుకే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తాం’’ అని నడ్డా ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా.. కుటుంబ పాలన పోవాలన్నా BJPను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం ధరణి రద్దు చేయం, దానిని కొనసాగిస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.దీంతో ధరణి విషయంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల మధ్య సమన్వయ లోపం ఏర్పండింది,

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement