Sandhya Theatre Tragedy Row: పోలీస్ అధికారి మీడియా ముందు వీధి రౌడీ భాషలో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు, చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నించిన విష్ణు వర్థన్ రెడ్డి, ట్వీట్ ఇదిగో..

అల్లు అర్జున్​ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్​ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు.

acp-sabbati-vishnu-murthy-blasts-on-allu-arjun(X)

ఎవ్వరైనా సరే పోలీసులను నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, తోలు తీస్తామని సస్పెండెడ్​ ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి హెచ్చరించారు. అల్లు అర్జున్​ డబ్బు మదంతో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్​ అయ్యారు. దీనిపై ఎక్స్ వేదికగా బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి మండిపడ్డారు. అల్లు అర్జున్ గారికి భారతీయ పౌరసత్వం లేదా ? తెలంగాణ- ఆంధ్ర వారికి ప్రత్యేక పౌరసత్వం, ఆధార్ కార్డు ఉందా ? తీస్ మార్ ఖాన్ ఎవరు ? ఆ ఖాన్ గారికి ప్రత్యేక హోదాలు TelanganaCOPs ఇచ్చిందా? ఒక వీధి రౌడీ భాషలో ఒక పోలీస్ అధికారి మీడియా ముందు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి మాట్లాడం తప్ప కాదా ? TelanganaCMO. ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి గారికి మీరు ఇలా మాట్లాడేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చారా TelanganaDGP అంటూ ప్రశ్నించారు.

అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన డీకే ఆరుణ

ఈ ఘటనపై సెంట్రల్​ జోన్​ డీసీపీ అక్షాంశ్​యాదవ్​ స్పందించారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో సంధ్య థియేటర్​ఘటనపై సస్పెండెడ్​ ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్​కాన్ఫరెన్స్​ పెట్టారని తెలిపారు. ఈ విషయంపై డీజీపీకి నివేదిక అందజేస్తున్నామని, ఆయనపై క్రమశిక్షణా చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను సహించబోమని తెలిపారు.

 BJP Leader Vishnu Vardhan Reddy Tweet 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif