Minister KTR: బీజేపీ తప్పు చేస్తే.. భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలా, ఘాటుగా స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్
ఈ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ తప్పు చేస్తే.. భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ కేటీఆర్ సోమవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నేతలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సస్పెండ్ చేసినప్పటికీ... ఆ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ తప్పు చేస్తే.. భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ కేటీఆర్ సోమవారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
బీజేపీ నేతలు చేసిన విద్వేష వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజానికి భారత దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలంటూ మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బీజేపీ క్షమాపణలు చెప్పాలని, ఓ దేశంగా భారత్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిత్యం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలు తొలుత భారతీయులకు క్షమాపణలు చెప్పాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)