Bomb Threat to Praja Bhavan: ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు
దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు.
తెలంగాణ ప్రజా భవన్‌లో బాంబ్ ఉందని ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు, డాగ్ స్వ్కాడ్ సిబ్బంది హుటహుటిన పరుగులు తీశారు. అందులో ఉంటున్న డిప్యూటీ సీఎం దంపతులు, సిబ్బందిని బయటకు పంపించి అణువణువు తనిఖీ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. కాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కుటుంబం ప్రజాభవన్ లో ఉంటున్న సంగతి విదితమే.
సీఎం క్యాంపు కార్యాలయాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా భవన్‌గా మార్చారు. క్యాంపు కార్యాలయం రూపు రేఖలు పూర్తిగా మార్చేశారు. అందుకోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దానిని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చారు. ప్రజా భవన్‌లో ఉండేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తి వ్యక్తం చేయకపోవడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ప్రజా భవన్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి భట్టి విక్రమార్క దంపతులు ప్రజా భవన్‌లో ఉంటున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)