Chandrababu Naidu In Ayodhya: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబునాయుడు, బాలరాముడి ప్రాణ ప్రతిష్టలో పాల్గొంటున్న టీడీపీ అధినేత..

అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరామప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు అయ్యేందుకు అయోధ్యకు వెళ్లారు. ఇదిలా ఉంటే రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.

chandrababu in ayodhya ( Image: X)

అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరామప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు అయ్యేందుకు అయోధ్యకు వెళ్లారు. ఇదిలా ఉంటే రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అయోధ్య రామజన్మభూమి ఆలయంలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పంపారు. మరోవైపు ఈ నెల 16 నుంచి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 16 నుంచి 21 వరకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి.జనవరి 18న ఆలయ గర్భగుడిలో రామలల్ల విగ్రహ ప్రతిష్ఠాపన, 22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యక్రమం జరగనుంది.

chandrababu in ayodhya ( Image: X)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement