Hyderabad: హైదరాబాద్‌ శివారులో కోడి పందాలు.. క్యాసినో, ఫామ్ హౌస్‌పై దాడి చేసి 64 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..55 లగ్జరీ కార్లు సీజ్, వీడియో ఇదిగో

ఫామ్‌హౌస్‌ కేంద్రంగా కోడిపందాలు.. క్యాసినో నిర్వహణ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ (Hyderabad:)శివారులోని ఫామ్‌హౌస్‌లో (Farmhouse) క్యాసినో(Casino) నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు.

Cockfighting at hyderabad farmhouse. Operating casino, here are the details(video grab)

ఫామ్‌హౌస్‌ కేంద్రంగా కోడిపందాలు.. క్యాసినో నిర్వహణ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ (Hyderabad:)శివారులోని ఫామ్‌హౌస్‌లో (Farm House) క్యాసినో(Casino) నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి పట్టుకున్నారు పోలీసులు. క్యాసినోతో పాటు కోడి పందాలు నిర్వహిస్తోంది ముఠా.

ఫామ్‌హౌస్‌పై దాడి చేసి 64 మందిని పట్టుకుంది రాజేంద్రనగర్ డీసీపీ బృందం(Cockfighting at Hyderabad farmhouse). రూ. 30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ చేశారు అధికారులు. 86 పందెం కోళ్లు, పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్, పేకాట స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులు కలిసి కోడిపందాలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

వీడియో ఇదిగో, మహబూబాబాద్‌లో రాత్రిపూట రాళ్ల వర్షం, తెల్లారి ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆందోళనలో ప్రజలు

ఇక మరో ఘటనలో మహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.కొన్నిరోజులుగా చీకటి పడితేచాలు ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. అంతేకాకుండా తెల్లవారుజామున ఏ ఇంటి ముందు చూసిన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంటున్నాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Cockfighting at hyderabad farmhouse

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now