RGI Airport: బూట్ల కింద 15 కిలోల బంగారం పెట్టుకొచ్చారు, శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన నిందితులు, దాని విలువ దాదాపు రూ.8 కోట్లుపై మాటే..
8 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు, దాని విలువ దాదాపు రూ. 8 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు.ఈ క్రమంలో షూకింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో దాదాపు 15 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, మిగతా వారిని విచారిస్తున్నారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)