Nagole Metro:నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన, ఎల్‌ అండ్ టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు, ఉద్రిక్తత

నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Hyderabad Nagole Metro Station has removed free parking, passengers protest

Hyd, Aug 14: హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ ప్రయాణీకుల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టికెట్ రేట్‌తో సమానంగా పార్కింగ్ ఛార్జీలు ఏంటని మండిపడుతున్నారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాల్సిందేనని మెట్రో సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉంది.

Here's Video: