Telangana: ముందు అమేథీలో గెలువు రాహుల్, ట్విట్టర్లో రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన మంత్రి కేటీఆర్

అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు.

TRS Party working president, Telangana IT Minister KTR | Photo: Twitter

భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్ట‌డాన్ని విమ‌ర్శించిన సంగతి విదితమే.ఈ నేప‌థ్యంలో ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ నేత రాహుల్ గాంధీ త‌న స్వంత పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే గెల‌వ‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు. జాతీయ పార్టీ ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శించే హ‌క్కు రాహుల్‌కు లేద‌ని మంత్రి ఆరోపించారు. ప్ర‌ధాన‌మంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ.. ముందుగా ప్ర‌జ‌ల్ని ఒప్పించి స్వంత నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెల‌వాల‌ని మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. 2019లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేసి రాహుల్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)