KCR Hospitalised: కేసీఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, ఆసుపత్రి వద్ద భద్రతను పెంచిన ప్రభుత్వం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్‌ స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు

Revanth Reddy (photo-X)

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్‌ స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌ ట్విట్టర్‌ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. అంతకుముందు, కేసీఆర్‌ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వద్ద ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోదా ఆసుపత్రి వైద్యులు, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వెల్లడి

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement