Komatireddy Venkatreddy: రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా..ఓడిపోయాకే కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా?, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్,వారిద్దరూ లెక్కలోకే రారని ఫైర్
రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా గాడు అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి . ఓడిపోయాకే కల్వకుంట్ల కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా? చెప్పాలన్నారు.
రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా గాడు అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkatreddy). ఓడిపోయాకే కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) దురాజ్ పల్లి గుర్తొచ్చిందా? చెప్పాలన్నారు. పదేళ్లలో ఒక్కసారి కూడా కవిత దురాజ్ పల్లికి వచ్చి బోనం ఎందుకు ఎత్తలేదు ? చెప్పాలన్నారు.
కృష్ణ జలాల విషయంలో జగన్ కు కేసీఆర్ అమ్ముడుపోయి తెలంగాణకు అన్యాయం చేశాడు.. వాళ్లు నల్గొండకు అంతా మంచే చేస్తే ఎందుకు డిపాజిట్లు పోయినయి చెప్పాలన్నారు. కేసీఆర్ ఇంజెక్షన్లు తీసుకుని దొంగ దీక్షలు చేశాడని ఆరోపించారు కోమటిరెడ్డి(Komatireddy).
అసలు తెలంగాణ కోసం కొట్లాడింది మేము.. నా దృష్టిలో కేటీఆర్, హరీష్ రావు అసలు లెక్కలకే రారు అని దుయ్యబట్టారు. ఇక నిన్న కవిత గట్టుజాతరలో బోనం సమర్పించిన సందర్భంగా చేసిన కామెంట్స్‌పై కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు.
Minister Komatireddy Venkatreddy angry on KTR
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)