Munugode Bypoll 2022: మునుగోడు ఉప ఎన్నికల్లో మరో ట్విస్ట్, రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం, జగన్నాథరావును బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రోహిత్ సింగ్‌ను ఆర్‌వోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు.
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. రోహిత్ సింగ్‌ను ఆర్‌వోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై వేటు పడిన సంగతి తెలిసిందే.
ఎన్నికల గుర్తుల వ్యవహారంలో వివాదం నెలకొన్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్‌కు గుర్తు కేటాయింపు విషయంలో జగన్నాథరావు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)