Nalgonda BRS Meeting: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి, నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్ గోబ్యాక్’ అంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నినాదాలు
కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది.
కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది. బస్సుపైకి కోడిగుడ్లు విసిరి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)