Hyderabad: ఏపీ ట్రాన్స్‌ జెండర్‌ను పెళ్లాడిన తెలంగాణ యువకుడు, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ, తర్వాత ఏమైందంటే..

ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్‌ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్‌ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్‌ జెండర్‌)ను ఖమ్మం జిల్లా‌కు చెందిన లావూరి గణేష్‌ ప్రేమించాడు

newly transgender married couple Ganesh and Deepu came to PS for protection as families opposed Their Marry

ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ట్రాన్స్‌ జెండర్‌ను తెలంగాణ యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీవీఆర్‌ కాలనీకి చెందిన పసుపులేటి దీపు (ట్రాన్స్‌ జెండర్‌)ను ఖమ్మం జిల్లా‌కు చెందిన లావూరి గణేష్‌ ప్రేమించాడు. హైదరాబాద్‌లో వీరికి పరిచయమైంది, ఏడాది నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరు కలిసి అక్టోబర్‌ 29న నందిగామ ప్రాంతంలోని ఓ ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నట్లు వారు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న గణేష్‌ కుటుంబ సభ్యులు ఆదివారం నందిగామ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గణేష్‌, దీపును పోలీసులు పిలిపించారు.

తనకు దీపు అంటే ఇష్టమని, తనతోనే ఉండిపోతానని గణేష్‌ కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పడంతో వారు వెళ్లిపోయారు. పోలీసుల సమక్షంలో వారిద్దరు ఒక్కటైయ్యారు. వీరిద్దరూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు లవ్‌కి జండర్‌తో సంబంధం లేదని కామెంట్ చేశారు.

newly transgender married couple Ganesh and Deepu came to PS for protection as families opposed Their Marry

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement