Hyderabad: కట్నం కోసం.. భార్యను వేధించిన పోలీసు అధికారి.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన భార్య.. వివరాలివే
కట్నం కోసం భార్యను వేధించాడు(Hyderabad) ఓ పోలీసు అధికారి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ డిఐ నరసింహ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Commissioner)కు ఫిర్యాదు చేశారు డిఐ భార్య సంధ్య
కట్నం కోసం భార్యను వేధించాడు(Hyderabad) ఓ పోలీసు అధికారి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ డిఐ నరసింహ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Commissioner)కు ఫిర్యాదు చేశారు డిఐ భార్య సంధ్య(Police Officer Harasses Wife). అదనపు కట్నం కోసం మానసికంగా , శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నాడని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లింది బాధిత మహిళ.
పెళ్లై 12 ఏళ్ళు అవుతుందని , తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని... అదనపు కట్నం తీసుకురకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పాప పుట్టినప్పుడు లక్షన్నర డబ్బులు , తులం బంగారం తీసుకున్నాడని ఆరోపణలు చేశారు.
ఇక మరోవైపు విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు ఓ టీచర్. భూపాలపల్లి కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులను విచక్షణా రహితంగా కొట్టారు టీచర్ . ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను కొట్టారు ఇంగ్లీష్ టీచర్ . విద్యార్థినుల చేతులకు గాయాలు కాగా విచారణ చేపట్టారు జిల్లా విద్యా శాఖ అధికారి.
Police Officer Harasses Wife for Dowry
కట్నం కోసం.. భార్యను వేధించిన పోలీసు అధికారి
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)