Rahul Gandhi's Disqualification: ఈ రోజు భారత ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే, రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ( PM Modi ) పాల‌న ఎమ‌ర్జెన్సీ( Emergency )ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు.

CM KCR (Photo-ANI)

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అన‌ర్హ‌త వేటు వేయ‌డాన్ని బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్( CM KCR ) తీవ్రంగా ఖండించారు. ప్ర‌ధాని మోదీ( PM Modi ) పాల‌న ఎమ‌ర్జెన్సీ( Emergency )ని మించిపోతుంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. నేర‌స్తులు, ద‌గాకోరుల కోసం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పై అన‌ర్హ‌త వేటు వేసి మోదీ ప‌త‌నాన్ని కొని తెచ్చుకుంటున్నార‌ని కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డంపై కేసీఆర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాహుల్ లోక్‌స‌భ( Lok Sabha ) స‌భ్య‌త్వం ర‌ద్దు చేయ‌డం బీజేపీ( BJP ) నియంతృత్వం, దురహంకార‌మే అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యం( Democracy ), రాజ్యాంగ హ‌క్కులు( Constitutional rights ) ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని మంత్రి పేర్కొన్నారు.  రాహుల్‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డం.. రాజ్యాంగాన్ని( Constitution ) దుర్వినియోగ‌ప‌ర‌చ‌డ‌మే అని కేటీఆర్ పేర్కొన్నారు. అత్యంత అప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిలో రాహుల్‌పై వేటు వేశార‌ని, ఇది తొంద‌ర‌పాటు చ‌ర్య అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Here's TS CMO Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement