KTR on Chetan Arrest: సీఎంను, మంత్రులను బూతులు తిడుతున్నా మేము సహిస్తున్నాం, బెంగుళూరులో నటుడు చేతన్ అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
బీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని బీఆర్ఎస్( BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు
బీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని బీఆర్ఎస్( BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. తెలంగాణ( Telangana ) లో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి( Chief Minister ), మంత్రులను అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడుతూ.. అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కన్నడ నటుడు చేతన్( Chetan )ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు తరలించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలోనూ అదే తరహాలో సమాధానం ఇవ్వాలేమోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు..? అని ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ.. దూషించే స్వేచ్ఛ కాకూడదని కేటీఆర్ పేర్కొన్నారు.
Here's Minister KTR Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)