Car Hits School Bus: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, స్కూలు బస్సును ఢీకొట్టిన కారు, దెబ్బకు బోల్తా పడిన బస్సు, ఆరుగురికి తీవ్ర గాయాలు
ఏకశిలా స్కూల్ బస్సు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీని తాకిడికి బస్సు బోల్తాపడింది.
హన్మకొండ-కమలాపూర్ మండలంలోని ప్రధాన రహదారిపై పాఠశాల బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఏకశిలా స్కూల్ బస్సు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీని తాకిడికి బస్సు బోల్తాపడింది.ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు విద్యార్థులకు గాయాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. వేగంగా వచ్చి స్కూల్ బస్సును ఢీకొట్టిన కారు.. కారు వేగానికి బొక్కబోర్లాపడ్డ బస్సు.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వరకు విద్యార్థులు.. పలువురికి గాయాలు.. హన్మకొండలో యాక్సిడెంట్.. వీడియో వైరల్
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)