 
                                                                 Hanamkonda, June 28: అతివేగం నిండు ప్రాణాలను బలికొంటున్నది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. హన్మకొండలో (Hanamkonda) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఓ స్కూల్ బస్సు హైవే మీద ప్రయాణిస్తూ యూటర్న్ తీసుకుంటుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు స్కూల్ బస్సును ఢీకొట్టింది. కారు వేగంతో నియంత్రణ కోల్పోయిన బస్సు ఒక్కసారిగా బొక్కబోర్లా పడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30 విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. విద్యార్థుల అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు తమ వాహనాలను ఆపి సహాయక చర్యలు చేపట్టారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సును ఢీ కొట్టిన కారు
హన్మకొండ - కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది.. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది.
ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురికి గాయాలు… pic.twitter.com/Uiqs63Y2Sb
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024
బస్సులో ముగ్గురికి గాయాలు
ఈ ప్రమాద ఘటనలో బస్సులోని ముగ్గురికి గాయాలు అయ్యాయి. అటు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
