Hyderabad: పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థిని, ప్రథమ చికిత్స అందించి పరీక్షా కేంద్రం దగ్గర దించిన మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
విద్యార్థిని, ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు గాయాలయ్యాయి.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు విద్యార్థిని తన తండ్రితో కలిసి వెళ్తుండగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బైక్ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. విద్యార్థిని, ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న మహంకాళి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఉపాశంకర్ స్పందించి వెంటనే తన వాహనంలో దగ్గర్లోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి తిరిగి సరైన సమయంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. మానవత్వం చాటుకున్న ఇన్‌స్పెక్టర్‌కు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's News