Telangana Assembly Budget Session 2024: వీడియోలు ఇవిగో, ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్‌ రావు చెప్పారు.ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు.

BRS MLAs Reached Telangana Assembly today in several auto rickshaws to support auto drivers

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. ఆటోడ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో చేరుకున్నారు. ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సుధీర్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌.. హైదరాబాద్‌ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయన్నారు.

రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్‌ రావు చెప్పారు.ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఆటో కార్మికులకు నెలకు రూ.10 జీవన బృతి కల్పించే విధంగా పొందుపర్చాలన్నారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now