Telangana: 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం కేసీఆర్, అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలు లాంచ్
చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేడు 466 ఎమర్జెన్సీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి వైద్యారోగ్యశాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర సేవలకు కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108, 102 అనే హెల్ప్‌లైన్ సేవల నంబర్లు స్పష్టంగా కనిపించేలా బ్రాండింగ్ చేశారు.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు(102), 34 హర్సె వెహికిల్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.
Here's CMO Tweet