RS Praveen Kumar Joins BRS: బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం కారు ఎక్కానని వెల్లడి
బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కారెక్కారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు.
బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కారెక్కారు.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్‌లో చేరుతున్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు.నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు.
Here's BRS Party Tweet