Falaknuma Express Fire: ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం, రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్‌ ట్వీట్‌

ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు

Falaknuma Express Fire Video

ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. దర్యాప్తు తర్వాత ప్రమాద కారణాలు తెలుస్తాయని తెలిపారు. మంటల్లో 7 బోగీలు దగ్ధమయ్యాయని చెప్పారు. మిగతా 11 బోగీలతో సికింద్రాబాద్‌కు రైలును తరలించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అరుణ్‌కుమార్‌ పరిశీలించారు.

మరోవైపు ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనపై డీజీపీ అంజనీ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాలిపోయిన బోగీల్లోని ప్రయాణికులను బస్సుల్లో తరలించామని తెలిపారు.

Heres' DGP Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement