Harish Rao Challenge to CM Revanth Reddy: ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్

ఆగస్టు 15 లోగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

Chief Minister Revanth reddy and BRS MLA Harish Rao (Photo-File Image)

ఆగస్టు 15 లోగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ లో ఆయన మాట్లాడారు.ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా.

ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యి. ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి. ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. రుణమాఫీ చెయ్యక పోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని హరీశ్‌రావు సీఎంను ప్రశ్నించారు.120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి..?’ అని హరీష్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఆగస్ట్ 15 లోపల రూ. 2 లక్షల రుణమాఫీ, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టేసి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now