Telangana: దారుణం.. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను ఎలా కొడుతున్నాడో వీడియోలో చూడండి, సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ నిలదీసిన ప్రయాణికులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్ రేజ్ ఘటన మరోసారి సంచలనం సృష్టించింది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం సమీపంలో జరిగిన ఈ సంఘటనలో, తన కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంతో ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సులో ప్రయాణిస్తోన్న పలువురు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

car driver assaults RTC staff (Photo-X)

వల్లంపట్ల రోడ్డుపై కారులో వస్తున్న వ్యక్తి, ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఆరోపించి, బస్సు ఆగగానే వెంటనే డ్రైవర్‌పై తీవ్రంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. అయితే, అక్కడి రోడ్డుపై స్థలం చాల తక్కువగా ఉండటంతో, బస్సు పెద్దదై ఉండటం వల్ల సైడ్ ఇవ్వడం సాధ్యంకాలేదని డ్రైవర్ పలుసార్లు చెప్పినప్పటికీ, కారు యజమాని వినకపోవడం గమనార్హం. డ్రైవర్ ఇచ్చిన వివరణను పూర్తిగా పక్కనబెట్టి, అతనిపై దూకి కొట్టడమే కాకుండా తీవ్ర హింస ప్రదర్శించాడు. ఈ దాడిని చూసిన బస్సు ప్రయాణికులు వెంటనే స్పందించి, “సైడ్ ఇవ్వకపోతే కొడతావా?” అంటూ దాడి చేసిన వ్యక్తిని నిలదీశారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

car driver assaults RTC staff

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement