Viral Video: బాహుబలి సీన్ రిపీట్ వీడియో ఇదిగో, తీవ్ర జ్వరంతో ఉన్న చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో విషయంలోకి వెళ్తే.. లక్మాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.

Man crossed stream holding child as like Bahubali Sivagami in Asifabad

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో విషయంలోకి వెళ్తే.. లక్మాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. అయితే భారీ వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు.

చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్‌ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు.

తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు.అనంతరం ముగ్గురూ కెరమె­రిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. ఈ వీడియో బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా ఉంది. మరి మీరు కూడా చూడండి..

Man crossed stream holding child as like Bahubali Sivagami in Asifabad

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement