TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఇకపై మహిళలు, సీనియర్ సిటిజన్లకు 100 రూపాయలకే వన్ డే పాస్ పథకం ప్రారంభం..ఒక్క టికెట్ తో రోజంతా ప్రయాణించవచ్చు..

మహిళలు, వృద్ధులు కేవలం రూ.100 చెల్లించి ఈ టికెట్‌ పొందితే 60 కి.మీ పరిధిలో రానుపోను ప్రయాణించొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే చెల్లుబాటు అవుతుంది.

tsrtc

తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో  ప్రయాణించే మహిళలు, వృద్ధుల కోసం కొత్తగా ‘టి-9’ టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సౌకర్యం ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద టీ-9 టికెట్లు లభిస్తున్నాయి. మహిళలు, వృద్ధులు కేవలం రూ.100 చెల్లించి ఈ టికెట్‌ పొందితే 60 కి.మీ పరిధిలో రానుపోను ప్రయాణించొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే చెల్లుబాటు అవుతుంది. 60 ఏళ్ల పైబడిన వారు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు చూపాలని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ టికెట్లను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు మాత్రమే ఇస్తారని, తెలంగాణ పరిధిలో ప్రయాణానికే వర్తిస్తాయని షరతులు విధించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement