Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణ హత్య, బండరాయితో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన దుండగులు, తాగిన మత్తులో గొడవ జరిగిందనే అనుమానాలు

హైదరాబాద్ నగరంలో మియాపూర్‌ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దుండగుల దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

representational image (photo-Getty)

హైదరాబాద్ నగరంలో మియాపూర్‌ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దుండగుల దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తాగిన తర్వాత ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బండరాయితో నెత్తి పైన గట్టిగా కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. మృతుడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement