Telangana: వీడియో ఇదిగో, గజ్వేల్‌లో పారతో ముఖంపై కొట్టి మహిళ దారుణ హత్య, రాత్రి వేరే వ్యక్తితో రావడంతో గొడవ ముదిరి..

తెలంగాణలో మహిళ హత్య కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ (Gajwel) మండలం రిమ్మనగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్‌ పంపువద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Woman brutally murdered in Gajwel Siddipet

తెలంగాణలో మహిళ హత్య కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ (Gajwel) మండలం రిమ్మనగూడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్‌ పంపువద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన సాదక్ తన భార్య ఆస్రాతో కలిసి గత కొంతకాలంగా పెట్రోల్ పంపు వద్ద సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిన ఆస్రా.. రాత్రికి మరో వ్యక్తితో కలిసి రిమ్మనగూడ వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో మహిళ హై ఓల్టేజ్ డ్రామా.. సినిమా స్టైల్‌లో రోడ్డుపై పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం, వైరల్‌గా మారిన వీడియో

రాత్రి పొద్దుపోయిన తర్వాత వారిద్దరు గొడవపడ్డారని, దీంతో అతడు పారతో ఆస్రా ముఖంపై కొట్టడంతో తీవ్రంగా గాయపడిందని, అక్కడికక్కడే మృతి చెందిందని సాదక్ తెలిపాడు. ఆమె మరణించడంతో అతడు అక్కడి నుంచి పారిపోయడని వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాదక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Woman brutally murdered in Gajwel Siddipet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement