Telangana: అప్పు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.25 వేలు పోగొట్టుకున్న యువతి, తీర్చమని అడగడంతో ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా, వీడియో ఇదిగో..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనలో యువతే నాటకమాడిందని పోలీసులు తెలిపారు. ఇంట్లో దొంగలు పడ్డారని యువతి కేకలు వేసింద. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు.. క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు.

young woman played drama saying that thieves broke into her house in broad daylight

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనలో యువతే నాటకమాడిందని పోలీసులు తెలిపారు. ఇంట్లో దొంగలు పడ్డారని యువతి కేకలు వేసింద. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు.. క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో యువతిని పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.25వేలు పోగొట్టుకుంది. ఆ నగదు స్నేహితుల వద్ద నుంచి తీసుకుంది. వారు...డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో చోరీ డ్రామాకు తెరలేపినట్టు విచారణలో తేలింది. బీరువాలో దుస్తులు తానే చిందరవందరగా పడేసి గట్టిగా కేకలు వేసినట్టు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement