IPS Umesh Chandra: దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రకు నివాళి అర్పించిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మార్చి 29న ఉమేశ్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఉమేశ్ చంద్ర నిలువెత్తు చిత్ర పటం ముందు సజ్జనార్ నివాళి అర్పించారు
దివంగత ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రకు (IPS Umesh Chandra) తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మంగళవారం నివాళి అర్పించారు. మార్చి 29న ఉమేశ్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఉమేశ్ చంద్ర నిలువెత్తు చిత్ర పటం ముందు సజ్జనార్ నివాళి అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిబద్ధత కలిగిన ఐపీఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న ఉమేశ్ చంద్ర.. మావోయిస్టులపై ఉక్కు పాదం మోపారు. ఈ క్రమంలో ఆయనను టార్గెట్ చేసిన మావోయిస్టులు హైదరాబాద్ నడిబొడ్డున పట్ట పగలు ఉమేశ్ చంద్రను కాల్చిచంపిన సంగతి తెలిసిందే.
దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర 1999 సెప్టెంబర్ 4న నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యారు. 90వ దశకంలో నక్సల్ ఉద్యమాన్ని నియంత్రించడంలో ఉమేష్ చంద్ర చేసిన సేవలను సీపీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)