Amazon Layoffs: అమెజాన్‌లో ఆగని లేఆప్స్, తాజాగా 30 మంది ఉద్యోగులపై వేటు, ఇప్పటివరకు కంపెనీ నుంచి 27 వేల మందికిపైగా ఉద్యోగులు రోడ్డు మీదకు
2022లో వ్యాపారులకు సహాయం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఈ యూనిట్‌ను అమెజాన్ ప్రారంభించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నదనే (Amazon Layoffs) విషయంపై స్పష్టతనివ్వలేదు.
అమెజాన్ (Amazon) తన ప్రైమ్ డివిజన్ నుంచి 5 శాతం ఎంప్లాయీస్‌ను తీసివేస్తున్నట్లు తెలిపింది. 2022లో వ్యాపారులకు సహాయం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఈ యూనిట్‌ను అమెజాన్ ప్రారంభించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నదనే (Amazon Layoffs) విషయంపై స్పష్టతనివ్వలేదు.ఈ యూనిట్‌లోని 30 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుదని తెలుస్తున్నది. రిట్రెంచ్ అయిన ఉద్యోగులకు మరో యూనిట్ లేదా మరేదైనా కంపెనీలో ఉద్యోగం పొందడానికి కంపెనీ సహాయం చేస్తుందని అమెజాన్ తెలిపింది. వారికి 50 రోజుల వేతనంతోపాటు ఇతర బెనిఫిట్స్ అందిస్తామని పేర్కొంది. 2022 చివరి నుంచి ఇప్పటివరకు అమెజాన్‌లో 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటుపడింది.
Here's News