Twitter Blue: బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం, స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటన

ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు.

Elon Musk and Twitter. (Photo credits Wikimedia Commons/ Twitter)

ట్విట్ట‌ర్ లో బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు. కాగా 8 డాల‌ర్ల‌కు ట్విట్ట‌ర్ బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం హోల్డ్‌లో పెట్టామ‌ని, సంస్థ కోసం మ‌రో క‌ల‌ర్‌తో ఆ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు మ‌స్క్ త‌న ట్విట్‌లో తెలిపారు. ఆ కొత్త స‌ర్వీసు విధానాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తార‌న్న‌ విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌లేదు.