Google: గూగుల్ కంపెనీకి షాకిచ్చిన కోర్టు, 30 రోజుల్లో రూ.1337 కోట్ల పెనాల్టీ కట్టాలని ఆదేశాలు, గత ఏడాది అక్టోబర్‌లో సీసీఐ జరిమానా విధింపు
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్(Google)పై కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(CCI) సుమారు రూ.1337 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆ జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్(deposit) చేయాలని నేషనల్ కంపెనీ లా అపిల్లేట్ ట్రిబ్యునల్(Natinal Company Law Appellate Tribunal) ఇవాళ తీర్పునిచ్చింది.
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్(Google)పై కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా(CCI) సుమారు రూ.1337 కోట్ల జరిమానా విధించింది. అయితే ఆ జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్(deposit) చేయాలని నేషనల్ కంపెనీ లా అపిల్లేట్ ట్రిబ్యునల్(Natinal Company Law Appellate Tribunal) ఇవాళ తీర్పునిచ్చింది. ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. తమ ఆదేశాలను పాటించాలని, 30 రోజుల్లోగా ఆ అమౌంట్‌ను డిపాజిట్ చేయాలని గూగుల్‌కు ఎన్‌సీఎల్ఏటీ ఆదేశించింది. ఆండ్రాయిడ్ మొబైల్(Android mobiles) డివైస్‌ల విషయంలో గూగుల్ సంస్థకు గత ఏడాది అక్టోబర్‌లో సీసీఐ జరిమానా విధించిన విషయం తెలిసిందే. అక్రమ పద్ధతుల్లో సాగే వ్యాపారాన్ని ఆపాలని గూగుల్ సంస్థను హెచ్చరించింది. సీసీఐ ఆదేశాలను సవాల్ చేస్తూ గూగుల్ సంస్థ ఎన్సీఎల్ఏటీ కోర్టులో అప్పీల్ చేసుకున్నది.
Here's Update