Google to Shut Down Album Archive: యూజర్లకు గూగుల్ షాక్, ఫోటోలను స్టోర్ చేసుకునే ఆల్బమ్ ఆర్కైవ్ షట్‌డౌన్ చేస్తున్నట్లు వెల్లడి
జులై 19 నుంచి చాట్‌లు, వీడియోలు, ఫోటోలను స్టోర్ చేసుకునే ఆల్బమ్ ఆర్కైవ్‌ను శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. సేవలు నిలిపివేయనున్న తరుణంలో యూజర్లు ఆల్బమ్ ఆర్కైవ్‌లో ఉన్న డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని గూగుల్ యూజర్లను కోరింది.
టెక్ గెయింట్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 19 నుంచి చాట్‌లు, వీడియోలు, ఫోటోలను స్టోర్ చేసుకునే ఆల్బమ్ ఆర్కైవ్‌ను శాశ్వతంగా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. సేవలు నిలిపివేయనున్న తరుణంలో యూజర్లు ఆల్బమ్ ఆర్కైవ్‌లో ఉన్న డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని గూగుల్ యూజర్లను కోరింది.సేవల నిలిపివేతపై వినియోగదారులకు మెయిల్స్ పంపుతోంది. ఆల్బమ్ ఆర్కైవ్‌ను నిలిపివేస్తున్నామని, ఇప్పటికే అందులో ఉన్న డేటాను డౌన్‌లోడ్ చేసుకునేలా గూగుల్‌కు చెందిన టేక్‌అవుట్‌ని ఉపయోగించుకోవాలని చెబుతోంది. 2018కి ముందు జీమెయిల్‌లో ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లు, ఆల్బమ్ కామెంట్స్,లైక్స్ వంటి కంటెంట్ డిలీట్ అవుతాయని వెల్లడించింది.
News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)