Modi Govt Plan For Data Theft: మొబైల్ యూజర్ల కోసం కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై డాటా చౌర్యం జరుగకుండా కఠిన నిబంధనలు, ప్రి ఇన్‌స్టాల్డ్ యాప్స్ విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ప్రి ఇన్ స్టాల్డ్ యాప్స్ తో స్పై (Spy) చేస్తున్నారని, వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. దీంతో సరికొత్త స్టాండర్స్ డెవలప్ చేసేందుకు నిపుణులతో చర్చించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ భావిస్తోంది.
New Delhi, March 15: భారతీయ యూజర్ల మొబైల్ డాటా ప్రైవసీ (Security Of Mobile Phones) కోసం కొత్త పాలసీ తీసుకువచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ప్రి ఇన్ స్టాల్డ్ యాప్స్ (pre-installed apps) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్రప్రభుత్వం. ఇప్పుడు మొబైల్ యూజర్ల కోసం సెక్యూరిటీ స్టాండర్స్ ను పెంచాలని భావిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ప్రి ఇన్ స్టాల్డ్ యాప్స్ తో స్పై (Spy) చేస్తున్నారని, వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. దీంతో సరికొత్త స్టాండర్స్ డెవలప్ చేసేందుకు నిపుణులతో చర్చించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ భావిస్తోంది. ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా ఎదుగుతోందని, ఇలాంటి సమయంలో మొబైల్ యూజర్ల డాటా భద్రతపై దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు.