IRCTC Down: ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ డౌన్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం, రైల్వే టికెట్లు బుక్ చేయలేకపోతున్నామంటూ యూజర్లు అసహనం
రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ (IRCTC) సేవలు డౌన్ అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి సాంకేతిక లోపం నెలకొంది. దీంతో టికెట్లు బుక్ చేయలేకపోతున్నామంటూ యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు
రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ (IRCTC) సేవలు డౌన్ అయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి సాంకేతిక లోపం నెలకొంది. దీంతో టికెట్లు బుక్ చేయలేకపోతున్నామంటూ యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. టికెట్ బుక్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్ వస్తోందని స్క్రీన్‌షాట్లు షేర్ చేస్తున్నారు. టికెట్ బుక్ చేసినప్పుడు మెయింటెనెన్స్ కారణంగా ఈ-టికెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని సందేశం వస్తోంది.
యాప్‌లో కొందరికి ‘అనేబుల్ టు కనెక్ట్’ అనే సందేశం కనిపిస్తోంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఈ అంతరాయం ఏర్పడడంపై యూజర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారికంగా స్పందించింది. సాంకేతిక కారణాల వల్ల ఇ-టికెట్ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడిందని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. టెక్నికల్ టీమ్ దీనిపై పనిచేస్తోందని, త్వరలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
Here's IRCTC Reply