Parag Agrawal: ట్విట్టర్ కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్, పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సీ, ట్విట్టర్ ద్వారా అందరికీ ధన్యవాదాలు చెబుతూ నోట్ విడుదల చేసిన పరాగ్
ఆయన స్థానంలో సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. పరాగ్ అగర్వాల్.. ఇండో అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా నిలిచారు.
మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయన స్థానంలో సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. పరాగ్ అగర్వాల్.. ఇండో అమెరికన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ గా నిలిచారు. బాంబే ఐఐటీలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన తర్వాత అగర్వాల్.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్నారు. 2011 అక్టోబర్‌లో ట్విట్టర్‌లో పరాగ్ అగర్వాల్ చేరారు. నాటి నుంచి సంస్థలు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ట్విట్టర్‌లో చేరకముందు ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూలో సేవలందించారు. ట్విట్టర్ టెక్నికల్ స్ట్రాటర్జీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ అండ్ సైన్స్ టైమ్‌లకు ఇప్పటి వరకు బాధ్యత వహించారు. 2019 డిసెంబర్‌లో పరాగ్ అగర్వాల్‌ను ప్రాజెక్ట్ బ్లూస్కై అనే ఇండిపెండెంట్ టీంకు ఇన్‌చార్జిగా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికపై దుర్భాషలాడే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించడానికి డీ సెంట్రలైజ్డ్ స్టాండర్డ్‌తో కూడిన టూల్స్ తయారు చేసే ఆర్కిటెక్‌లు, ఇంజినీర్లు, డిజైనర్లకు ఈ బ్లూ స్కై వనరుగా ఉంటుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)