Food Allergy: పిల్లల్లో ఫుడ్ అలర్జీనా?? అయితే భవిష్యత్తులో అస్తమా, ఊపిరితిత్తుల ఎదుగుదలలో సమస్యలు రావొచ్చు జాగ్రత్త!
శిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్ చిల్డ్రన్స్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా పరిశోధనలో తేలింది.
Newdelhi, Jan 26: శిశువుల్లో (Infants) తరచూ ఏర్పడే ఫుడ్ అలర్జీతో (Food Allergy) భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు (Health Issues) మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్ చిల్డ్రన్స్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా పరిశోధనలో తేలింది. చిన్నప్పుడు ఫుడ్ అలర్జీబారిన పడిన పిల్లలు ఆరేండ్ల వయసు వచ్చేనాటికి అస్తమా వంటి రోగాలు, ఊపిరితిత్తుల ఎదుగుదలలో సమస్యలు ఎదుర్కొనవచ్చని ఈ అధ్యయనం హెచ్చరించింది. 5,276 మంది నవజాత శిశువులపై ఈ పరిశోధన నిర్వహించారు. ఈ వివరాలు లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి.