Chandrayaan-3: చంద్రయాన్-3 వీడియో ఇదిగో, ఈనెల 13వ తేదీన నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో, జీఎస్ఎల్వీ రాకెట్‌తో నేడు అనుసంధానం
చంద్రయాన్-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13వ తేదీన ఇస్రో ప్రయోగించనున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా ఈ రోజు చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను .. జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఇవాళ అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
చంద్రయాన్-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13వ తేదీన ఇస్రో ప్రయోగించనున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా ఈ రోజు చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను .. జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఇవాళ అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ నుంచి ఆ రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ సుమారు 3900 కేజీల బరువు ఉంటుంది. తొలుత యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో పేలోడ్‌ను క్యాప్సూల్ చేశారు. ఆ తర్వాత దాన్ని ప్రత్యేక వాహనంలో సతీశ్ ధావన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ రాకెట్‌తో పేలోడ్‌ను అనుసంధానం చేశారు. రాకెట్ పైభాగంలో ఉన్న పేలోడ్‌లో ల్యాండర్, రోవర్ ఉంటాయి. దాంట్లో ఉన్న ప్రొపల్సన్ మాడ్యూల్ వల్ల చంద్రుడికి సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకు స్పేస్‌క్రాఫ్ట్ వెళ్తుంది. నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్ సురక్షితంగా దిగుతుందని, ఆ తర్వాత రోవర్ అక్కడ రసాయనక విశ్లేషణ చేపడుతుందని ఇస్రో అధికారులు తెలిపారు.
Video